ఈ డిసెంబర్లో గేమ్ చేంజర్ రానుందా? ఈ డిసెంబర్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్‌గా మారనుందా? ఆ నెల్లోనే రాజా సాబ్ థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారా? పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా? లేదా? …ఈ డౌట్ వల్ల క్రియేట్ అవుతున్న ఈ కన్ఫ్యూజన్కి ఫుల్స్టాప్ పడేదెప్పుడు?
అనౌన్స్ చేసిన టైమ్‌కి పక్కాగా ల్యాండ్ అయితే డిసెంబర్ 6న థియేటర్లలో పుష్పరాజ్ అసలు తగ్గేదేలే మేనరిజాన్ని విట్నెస్ చేయొచ్చు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా? లేదా అనే టాపిక్ మీద ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చే జరుగుతోంది. మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు కూడా డిసెంబర్లో కనిపిస్తుండటంతో అనుమానాలు మరింత ముదురుతున్నాయి.
మా సినిమా డిసెంబర్లో వచ్చేస్తుంది అని గట్టిగా చెప్పారు మంచు విష్ణు. పుష్పరాజ్ రాకపోతే ఆ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవడానికి చాలా సినిమాలే సన్నద్ధమవుతున్నాయంటున్నారు క్రిటిక్స్.
అటు గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి కూడా కావాల్సినంత సమయం ఉండటంతో క్రిస్మస్ టైమ్ గ్లోబల్స్టార్కి… మంచి ముహూర్తమనే అంటున్నారు ట్రేడ్ పండిట్స్.
ఇటు రాజా సాబ్‌ని కూడా డిసెంబర్‌కే తీసుకురావడానికి ప్లానింగ్ జరుగుతోందట. వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకున్నారు రాజాసాబ్‌ని. ప్రభాస్ సంక్రాంతికి వస్తే, ఆ సీజన్‌కి ఖర్చీఫ్ వేసుకున్న మిగిలిన సినిమాల రిలీజులు డిస్టర్బ్ అవుతాయి. అందుకే, లాస్ట్ ఇయర్ సలార్‌ని డిసెంబర్లో విడుదల చేసినట్టు, ఈ ఏడాది రాజాసాబ్‌ను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. పుష్ప 2 మేకర్స్ నుంచి పక్కాగా ఓ మాట వినిపించేవరకు ఇలాంటి ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టడం కష్టం అంటున్నారు విమర్శకులు.