హృదయ కాలేయం.. ఈ సినిమాను ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోరు.. ఊహించని విధంగా ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హృదయకాలేయం సినిమా లాజిక్స్ లేకుండా సాగే కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. సినిమా అంతా సీరియస్ గా జరుగుతున్నా ఆడియన్స్ మాత్రం నవ్వుతూనే ఉంటారు. 2014 లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన ఇషికా సింగ్, కావ్యా కుమార్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో కత్తి మహేష్ కూడా కీలక పాత్రలో నటించాడు. సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. ఊరిలో బంగారం పని చేసేవాడు సంపూర్ణేష్ బాబు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సినిమాలో నటించాలన్న ఆశతో.. ఊర్లో పని లేనప్పుడు హైదరాబాద్ వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. అలా ఓ రోజు దర్శకుడి కంట్లో పడి హీరోగా మారాడు.
హృదయకాలేయం సినిమా తర్వాత కామెడీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించింది బేబీ సినిమా ఫెమ్ సాయి రాజేష్.. కాకపోతే హృదయకాలేయం సినిమాకు పేరు మార్చుకొని డైరెక్షన్ చేశాడు. స్టీవెన్ శంకర్ అనే పేరుతో సినిమా చేశాడు సాయి రాజేష్. ఇదిలా ఉంటేముందుగా హృదయకాలేయం సినిమా కోసం మరో నటుడిని అనుకున్నారట.
ఆయన ఎవరో కాదు జబర్దస్త్ నటుడు అప్పారావు. అయితే అప్పారావు అంతకు ముందే కమెడియన్ గా పలు సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలో ఒక కొత్త మొహం కావాలని సాయి రాజేష్ సంపూర్ణేష్ ను హీరోగా పెట్టుకున్నాడట. అయితే వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే సినిమాలో సంపూర్ణేష్ బాబు, అప్పారావు కలిసి నటించారు. ఆ మూవీ సెట్స్ లో సంపూర్ణేష్ బాబు అప్పారావుతో మాట్లాడుతూ.. బాబాయ్, హృదయ కాలేయం సినిమాలో హీరోగా ముందుగా నిన్నే అనుకున్నారు. కానీ నువ్వు అప్పటికే కమెడియన్ గా చాలా సినిమాల్లో చేశావు. కొత్త వాడు అయితే బాగుంటుందని నన్ను తీసుకున్నారు అని చెప్పాడట. ఈ విషయాన్ని అప్పారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.