కల్కి సిరీస్‌లో నానితో పాటు ఆ హీరో కూడా ఉంటారు.. క్రేజీ న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్

0
25
కల్కి సిరీస్‌లో నానితో పాటు ఆ హీరో కూడా ఉంటారు..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా కుమ్మేస్తుంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ప్రభాస్ గురించి , ఆయన స్టామినా గురించే మాట్లాడుకుంటున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ కల్కి సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కురుక్షేత్ర యుద్ధం ముగింపుతో మొదలై కలియుగం ముగింపులో ముగుస్తుందని తెలుస్తోంది. అలాగే సినిమాలో మహాభారతంలోని కొన్ని పాత్రలను కూడా సినిమాలో ఉపయోగించారు. అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ మరియు కృష్ణుడి పాత్రలు చూపించబడ్డాయి. కానీ కృష్ణుడి ముఖం మాత్రమే చూపించలేదు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలా మంది కనిపించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు నాని కూడా నటిస్తున్నారని టాక్ వినిపించింది. కానీ సినిమాలో నాని ఎక్కడా కనిపించలేదు. తాజాగా కల్కి సక్సెస్ మీట్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. నాని, నవీన్ పోలిశెట్టి గురించి క్రేజీ న్యూస్ చెప్పారు.

కల్కి పార్ట్ వన్ లో నాని, నవీన్ శెట్టిలను చూపించడం కుదరలేదు.. కానీ తప్పకుండా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను అని చెప్పారు నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నటించిన వారందర్ని చూపించారు నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు కల్కి సెకండ్ పార్ట్ లో నాని, నవీన్ కూడా కనిపిస్తారని టాక్ జోరందుకుంది. నాని, నవీన్ ను నాగీ ఎలా చూపిస్తారా అన్న ఆసక్తి మొదలైంది ప్రేక్షకుల్లో.. కాగా నాని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేశాడు. అలాగే నవీన్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here