అప్పుడు అలా జరిగింది.. అందుకే నేను పొట్టిబట్టలు వేసుకోను.. అసలు విషయం చెప్పిన సాయి పల్లవి

0
29
అప్పుడు అలా జరిగింది.. అందుకే నేను పొట్టిబట్టలు వేసుకోను..

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ఆమె ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్కిన్ షోకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు.. అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ ను పెంచుకుంటున్నారు. కానీ సాయి పల్లవి అలా కాదు.. ఎప్పుడూ సాంప్రదాయ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ సాయి ఎందుకు గ్లామర్ షో చేయదు.? షార్ట్ డ్రస్సులు ఎందుకు వేసుకోదు అని చాలా మంది మాట్లాడుకుంటుంటారు. తాజాగా దీనిపై సాయి పల్లవి మాట్లాడింది. దీనికి కారణం కూడా చెప్పింది ఈ చిన్నది.

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమమ్’తో సాయి పల్లవి తన కలర్‌ఫుల్ కెరీర్‌ను ప్రారంభించింది. ఈ చిత్రంలో చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది.. ఆ తర్వాత ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఫిదా అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా కనిపించింది సాయి పల్లవి. ఆ తర్వాత ఏ సినిమాలోనూ సాయి పల్లవి పిచ్చి పిచ్చి డ్రస్సులు వేసుకోవడం కానీ.. స్కిన్ షో చేయడం కానీ చేయలేదు. ఇందుకు గల కారణాన్ని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ..

‘నేను జార్జియాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు నేను టాంగో నేర్చుకున్నాను. ఇందుకోసం నేను పొట్టి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. నేను నా తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ తీసుకున్నాను. దీనికి వారు ఓకే చెప్పారు. ఆ తర్వాత నేను నటించిన ప్రేమమ్‌ విడుదలైంది. నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నా టాంగో డ్రెస్ వైరల్ అయింది. ఈ సమయంలో ప్రజలు నా దుస్తులపై కామెంట్స్ చేశారు. నేను చాలా అసౌకర్యంగా భావించాను,’ అని తెలిపింది. ఆ సంఘటన తర్వాత నేను సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను. ఒక పని చేసి మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. బట్టలను బట్టి మనిషిని అంచనా వేయడం సరికాదు. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని చూపించవు’ తెలిపింది సాయి పల్లవి. కాగా ప్రస్తుతం సాయి పల్లవి  ‘రామాయణం’ హిందీ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here