అనుపమ, బెల్లంకొండ మధ్యలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుందా.? ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే

0
20
ఇప్పుడు చూస్తే అమ్మబాబోయ్ అనాల్సిందే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిట్లుఫ్లాప్స్ తో సంబంధంలేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అల్లుడు శ్రీను అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో.. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే తమిళ్ సినిమా రచ్చాసన్ మూవీకి రీమేక్ గా రాక్షసుడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది. కాగా ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ పాప తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పేరు అమ్ము అభిరామి. రాక్షసుడు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు తెలుగులో ఓ సినిమా కూడా చేసింది. విద్యా సాగర్ రాజు దర్శకత్వం వహించిన F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) చిత్రంలో నటించింది.

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?

ఈ మూవీలో అమ్ము అభిరామి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ అమ్మడికి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. అమ్ము అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అలాగే మణిరత్నం తెరకెక్కించిన “నవరస” వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. ఇటీవలే హాట్ స్పాట్ అనే తమిళ్ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. రెగ్యులర్ గా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here